డల్లాస్ సభలో జరిగిన ఘోర అవమానం..జగన్ కి మూల్యం తప్పదా..?

Monday, August 19th, 2019, 10:07:19 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకి వెళ్లారు. ఆయనకి అక్కడ కళ్ళు చెదిరిపోయే రేంజులో ఘన స్వాగతం లభించింది. డల్లాస్ లో జరిగిన కార్యక్రమంలో జగన్ స్పీచ్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఆ సభకి భారీస్థాయిలో వైసీపీ అభిమానులు అమెరికా నలుమూలల నుండి కొన్ని వేల డాలర్లు ఖర్చుపెట్టుకొని మరి వచ్చారు. ఆలా వచ్చిన వాళ్ళకి సభలో ఘోర అవమానాలు జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సభని ఆర్గనైజ్ చేసిన వాళ్ళ పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

జగన్ సమావేశం కోసం చాలా మంది పెద్ద స్థాయి వ్యక్తులు ఫండ్స్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ని బట్టి వీఐపీ, వీవీఐపీ అనే క్యాటగిరి ఫిక్స్ చేశారు. కానీ వాళ్ళకి అందుకు సంబంధించిన క్యాటగిరి ట్యాగ్ లు సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అదే విధంగా పార్టీ కోసం అమెరికాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళకి కూడా ఈ సమావేశంలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ముందు అనుకున్నారు. ఇందులో భాగంగా కొందరితో జగన్ ని కలిసే భాగ్యం కూడా కల్పిస్తామని చెప్పారు. అయితే ఈ సమావేశంలో చెప్పిన పనులు అవి కూడా సరిగ్గా చేయకుండా అగ్రనైజర్స్ దారుణంగా ప్రవర్తించారని తెలుస్తుంది.

వైసీపీ తరుపున అమెరికాలో యాక్టీవ్ గా ఉండే 70 ఏళ్ళు వయసున్న ఒక నేత జగన్ ని కలవటానికి ఆయన హోటల్ సూట్ ముందు దాదాపు గంట సేపు నిలబడి ఉన్నకాని, అగ్రనైజర్స్ చూసికూడా ఆయన్ని లోపాలకి పంపించలేదు, ఆ తర్వాత అదే పెద్దయన స్టేజి ముందు కూర్చుంటే ఆయన్ని లేపి ఆ స్థానంలో వేరేవాళ్లని కూర్చోబెట్టి ఆయన్ని స్టేజి పక్కన నిలబడేలా చేశాడు. ఈ అవమానం భరించలేని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతే కాకుండా ఈ సమావేశం కోసం దాదాపు 10 లక్షలు దాక డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి ముందు జగన్ తో పర్సనల్ ఫోటో అని చెప్పారు, తీరా అక్కడికి వచ్చేసరికి జగన్ ని కలిసే అవకాశం కూడా సరిగ్గా కల్పించలేదు.

ఇలా చెప్పుకుంటూ పొతే డల్లాస్ సభలో చాలా వ్యవహారాలే జరిగాయి. పైన పటారం,లోన లొటారం అనే చందంగా అయ్యింది. దీనికి కారణం సరైన ఆలోచన లేని అగ్రనైజర్స్ అని తెలుస్తుంది. ఇండియా నుండి అమెరికాకి ఐదుగురు కన్వెనేర్లు, ఇటీవల ఒక కీలక పదవి చేపట్టిన ఒక నాయకుడు, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే, ఇలా అందరు కలిసి డల్లాస్ సభని రసాభాస చేశారని, అక్కడి నేతలకు సరైన గౌరవం ఇవ్వకుండా అవమానించారని అక్కడి ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు.