నా పేరు సూర్య చిత్రం పై కుట్ర జరుగుతోంది : అల్లు అరవింద్

Monday, April 30th, 2018, 03:48:55 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రచయిత వక్కంతం వంశీ తొలిసారి మెగా ఫోన్ పడుతున్న చిత్రం నా పేరు సూర్య. ఇప్పటికే ఆంధ్ర లోని మిలిటరీ మాధవరం లో విడుదల చేసిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభిస్తోంది. కాగా నిన్న చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని గచ్చి బౌలి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథి గా విచ్చేసారు. కాగా ఈ వేడుకలో అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, వక్కంతం వంశి ఎంతో జాగ్రత్తగా పక్కాగా ఈ సినిమా స్క్రిప్ట్ రూపొందించారని అన్నారు. అలానే నిర్మాతలు, లగడపాటి శ్రీధర్, నాగబాబు, కో ప్రొడ్యూసర్ బన్నీ వాసు చిత్రాన్ని చాలా లావిష్ గా, ఖర్చు పెట్టి తెరకెక్కించారు అన్నారు.

పోతే ఈ చిత్రం పై కొందరు కుట్రపన్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గత నెలరోజులుగా టాలీవుడ్ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు కొన్ని మనసుకు బాధ కలిగించాయని, అందువల్ల కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందని అన్నారు. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయాలు కొందరికి నష్టం కలిగించాయని, అటువంటి వారు ఈ సినిమా పై కుట్రపన్ని నెగటివ్ టాక్ తీసుకొస్తారని, అలానే మిక్స్డ్ టాక్ కూడా తీసుకొచ్చే ప్రయత్రం చేస్తారని చెప్పుకొచ్చారు. కానీ మెగాభిమానులు మాత్రం ఈ కుట్రని గట్టిగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఏమి చేసినా మంచి చిత్రాలని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని, ఈ చిత్రం తప్పకుండ సూపర్ హిట్ అవుతుందని, అన్ని విషయాలు చిత్ర విడుదల తర్వాత జరిగే సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందామని ఆయన అన్నారు. కాగా మే 4న ప్రపంచ వ్యాప్తంగా నా పేరు సూర్య భారీ లెవెల్లో విడుదల కానుంది……

  •  
  •  
  •  
  •  

Comments