మేడారం జాతరలో టీఆర్ఎస్ మంత్రికి షాక్.. కాన్వాయ్‌పై రాళ్ళ దాడి..!

Thursday, February 6th, 2020, 08:41:17 PM IST

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. అయితే ఈ జాతరకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మంత్రి సత్యవతి రాథోడ్‌కి చుక్కెదురయ్యింది. ఆమె కాన్వాయ్‌పై ఒక్కసారిగా రాళ్ళ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్రులు భక్తుల రూపంలో వచ్చి మంత్రి కాన్వాయ్‌పైకి రాళ్ళు రువ్వారు.

ఆ ఘటనలో మంత్రి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే మంత్రి సత్యవతి రాథోడ్ గారికి మాత్రం ఎలాంటి హానీ కలగకపోవడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు దర్యాప్తును ప్రారంభించారు.