బాబుకి పట్టిన గతే జగన్ పట్టబోతుందా..? అదే తప్పు చేస్తున్న సీఎం

Monday, July 22nd, 2019, 08:03:53 AM IST

తమ పార్టీ అధికారంలోకి వస్తే, పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు మేలు చేకూరే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అయితే అవి ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా లేకుండా వుండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి,లేకపోతే దారుణమైన పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. 2014 లో టీడీపీ గెలిచిన తర్వాత జన్మభూమి కమిటీలు అంటూ ఏర్పాటు చేసి, ఆ పార్టీ నాయకులకి మేలు చేగురే విధంగా చేశాడు. ఒక గ్రామంలో ప్రభుత్వం తరుపున ఎలాంటి పనులు కావాలన్నా ఆ కమిటీ అనుమతి తప్పనిసరి, దీనితో ఆ సభ్యులు ప్రతి చిన్న దానికి డబ్బులు డిమాండ్ చేయటం స్టార్ట్ చేశారు. చివరికి అర్హులు అయినా వాళ్ళకి పెన్షన్ రాయించాలన్న కూడా డబ్బులు కావాలని అడిగే స్థాయికి వెళ్లారు.

మొన్న టీడీపీ ఓడిపోయిందంటే దానికి జన్మభూమి కమిటీలు కూడా ఒక ప్రధాన కారణం అన్నారంటే పరిస్థితి ఎలా తయారైయ్యిందో అర్ధం చేసుకోండి. ఇక 2019 లో జగన్ గెలిచి సీఎం అయిన తర్వాత వలంటీర్ వ్యవస్థ అంటూ కొత్తదానిని ప్రవేశపెట్టాడు. జన్మభూమి కమిటీల తరహాలోనే ఇవి కూడా పనిచేస్తాయి. అయితే వాటికీ పారదర్శకంగా ఇంటర్వూలు నిర్వహించి దాని ద్వారా వలంటీర్ నియామకం జరుగుతుందని తెలిపాడు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇందులో ఆయా లోకల్ ఎమ్మెల్యే ప్రమేయంతోనే ఆ నియామకాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

జగన్ చెప్పిన దానికి చాలా బిన్నంగా అక్కడ జరుగుతుంది. కేవలం వైసీపీ సానుభూతి పరులకి మాత్రమే వలంటీర్ పోస్ట్ ఇస్తున్నారని తెలుస్తుంది. దీనితో మిగతా వాళ్లలో అసంతృప్తి చెలరేగుతుందని తెలుస్తుంది . అలాగే ఈ పోస్టుల విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. వైసీపీ సభ్యుల్లోనే వీటి మీద తగాదాలు పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తుంటే జగన్ పెట్టిన పధకం తిరిగి తిరిగి అయన మెడకు చుట్టుకునే అవకాశమే కనిపిస్తుంది.