ఇదంతా చంద్రబాబు ఆడే రాజకీయ చదరంగమే – సోము వీర్రాజు!

Thursday, July 30th, 2020, 10:09:09 PM IST

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గా నియమితులు అయిన సోము వీర్రాజు రాష్ట్ర రాజధాని విషయం లో, రాజకీయాల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయం లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని, దేశం లోని అనేక రాష్ట్ర రాజధానుల విషయం లో కేంద్ర ఎన్నడూ కూడా జోక్యం చేసుకోలేదు అని స్పష్టం చేశారు. అయితే రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్య పెడుతున్నారు అని, అనాడు బాబు వ్యాఖ్యల పై కేంద్రం ఎన్నడూ జోక్యం చేసుకోలేదు అని, అలానే మూడు రాజధానుల విషయం లో కూడా ఉంటుంది అని వ్యాఖ్యానించారు.

అయితే టీడీపీ నేతలు మాత్రం రాజదాని విషయం లో బీజేపీ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు. అంతేకాక రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఇక సీరియస్ గా వ్యవహరించ నున్నది అని, బీజేపీ నేతలు టీడీపీ కి దగ్గరా అవుతున్నారు అని చంద్రబాబు చేసే వ్యాఖ్యలు, ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాము కూడా ఎత్తుగడలు వేస్తాం అని అన్నారు. అయితే బీజేపీ జన సేన కి ఓటు బ్యాంక్ 20 శాతం ఉందని తాము భావిస్తున్నామని సోము వీర్రాజు ఢిల్లీ లో మీడియా సమావేశం లో అన్నారు.