ఆ ఆలోచన చేసింది మొదట కాంగ్రెస్ పార్టీనే – సోము వీర్రాజు

Tuesday, April 6th, 2021, 12:59:14 PM IST

దేశం లో బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాతే అవినీతిని అరికట్టాం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, కుంభకోణాలకు పాల్పడిన అవినీతి పరులను జైళ్లకు పంపించాం అని సోము వీర్రాజు అన్నారు. అయితే తిరుపతి లోని బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. అయితే ఈ మేరకు ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆలోచన చేసింది మొదట కాంగ్రెస్ పార్టీనే అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కచ్చితంగా అధికారం లోకి వస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖ ఉక్కు కర్మాగారం ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతం కేంద్ర ప్రభుత్వం ఇలానే ఆలోచన చేసింది అని అన్నారు. అయితే ఇప్పుడు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.