ఐదేళ్లలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేసారు – బీజేపీ నేత

Friday, February 14th, 2020, 09:28:24 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు వద్ద పని చేసిన మాజీ పీఎస్ ఫై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో పీఎస్ నుండి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు అక్రమార్జన గుర్తించినట్లుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దానిని టీడీపీ ఖండిస్తూనే ఉంది. అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ నేత సోము వీర్రాజు స్పందించారు. నారా లోకేష్ ఫై ఘాటు విమర్శలు చేసారు.

లోకేష్ తింగరి మంగళం కాదని అన్నారు. విషయాన్నీ పక్కదారి పట్టించాలనే వైసీపీ ఫై ఆరోపణలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అవినీతి పరుడుకి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఫై నారా లోకేష్ స్పందించాలని కేంద్రం కోరలేదు అంటూ ఎద్దేవా చేసారు. చంద్రబాబు మిత్రపక్షంగా ఉంటూనే మోడీ ని దూషించారని అన్నారు. బాబు హయాంలో చేసింది రూలింగ్ కాదని, ట్రేడింగ్ అని సంచలన ఆరోపణలు చేసారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేసారని ఘాటు విమర్శలు గుప్పించారు.

తప్పు చేసి తప్పించుకోవడం లో చంద్రబాబు ని మించిన మేధావి లేరని,రెండు వేల కోట్లు చిన్న విషయం కాదు, పెద్ద కుంభ కోణం అని సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం మాజీ పీఎస్ వద్దే ఇంత పెద్ద మొత్తంలో దొరికితే, చంద్రబాబు పాలనలో భారీగా అవినీతి జరిగిందని, చంద్రబాబు దేశ ద్రోహి అని సోము వీర్రాజు అన్నారు.