అత్త ఆరోగ్యం బాలేదని అల్లుడు ఏం చేశాడో తెలిస్తే షాక్..!

Wednesday, June 5th, 2019, 07:24:37 PM IST

కన్న బిడ్దలే తల్లితండ్రులను వదిలేసే సమాజంలో తన అత్తకి ఆరోగ్యం బాగాలేదని అమె అల్లుడు ఏం చేశాడో తెలిసిన అందరూ షాక్‌కి గురవుతున్నారు. అయితే అసలే ఎండాకాలం ఎండ తీవ్రతను వయసులో ఉన్నవారే తట్టులోలేరు. ఇక ముసలి వారు మాత్రం ఏం తట్టుకుంటారు. ఎండలకు తాలలేక కొంతమంది ముసలి వారు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అయితే సాధారణంగా ఎండాకాలంలో ఎండలకు తట్టుకోలేని వారు కూలర్లు పెట్టుకుంటారు. మరీ కొంచెం డబ్బున్న వారైతే ఏసీలు పెట్టించుకుంటారు. అయితే ఖరీదైన బంగళాలు, డాబాల్లో ఏసీలు ఎక్కువగా కనిపిస్తాయే తప్పా, పల్లెటూర్లలో అయితే ఏసీలు కనిపించడం చాలా అరుదు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ నగర్‌లో ఓ పూరి గుడిసెకు ఏసీనీ బిగించిన సంగతి ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఆ గుడిసెలో నివసిస్తున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మంచాన పడింది. అయితే ఆమె ఆ గుడిసెలో ఎండ తీవ్రతకు తట్టు కోలేదని ఆమె అల్లుడు మొదట కూలర్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఎండలు మరీ ఎక్కువగా అనిపించాయేమో అతగాడికి కూలర్‌ని తీసేసి ఏకంగా ఏసీనే పెట్టించేశాడు. దీనితో అత్త గుడిసెలో అయినా ఏసీ కిందా హాయిగా నిద్రపోయేది. అయితే తన కోసం అల్లుడు ఇంత చేస్తున్నది చూసిన ఆ అత్త ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతేకాదు గుడిసెకు ఏసీ ఏర్పాటు చూసి, అత్తను అంత బాగా చూసుకుంటున్న అల్లుడిపై అక్కడి కాలనీవాసులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.