ముకుపుడ‌క‌ల సోనాక్షి సినిమా తెలుగులో రీమేక్‌?

Monday, October 30th, 2017, 12:21:41 PM IST

భార్య‌ను మ‌ర్డ‌ర్‌ చేసిన భ‌ర్త‌గా నింద‌ప‌డిన యువ‌కుడు పారిపోయే క్ర‌మంలో వేరొక యువ‌తి గ‌దిలో చేరితే .. ఆ క్ర‌మంలో ఏం జ‌రిగింది? అనే ఆస‌క్తిక‌ర క‌థ‌తో వ‌చ్చిన ఇత్తెఫాక్ 1960ల‌లో గ్రేట్ క్లాసిక్‌గా అల‌రించింది. నాడు రాజేష్ ఖ‌న్నా న‌ట‌న‌కు యువ‌త‌రం వీరాభిమానులుగా మారిపోయారంటే అతిశ‌యోక్తి కాదు.

ఇప్పుడు అదే సినిమా బాలీవుడ్‌లో సోనాక్షి సిన్హా, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, అక్ష‌య్ ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా తెర‌కెక్కించి రిలీజ్ చేస్తున్నారు. అభ‌య్ చోప్రా-జునో చోప్రా నిర్మాత‌లుగా, క‌ర‌ణ్ జోహార్‌, షారూక్ ఖాన్ స‌హ‌నిర్మాత‌లుగా తెర‌కెక్కించిన చిత్ర‌మిది. నేటి త‌రానికి త‌గ్గ‌ట్టు మార్పు చేర్పుల‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. తాజా `ఇత్తెఫాక్‌` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. ఇప్ప‌టికే రీమేక్ హ‌క్కుల కోసం ప‌లువురు నిర్మాత‌లు హిందీవెర్ష‌న్ నిర్మాత‌ల్ని సంప్ర‌దించారుట‌. ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డికానున్నాయ‌ని చెబుతున్నారు.