సోనాక్షి కూడా గ్లామర్ దారిలోకే !!

Tuesday, February 6th, 2018, 05:28:00 PM IST

ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా వెలగాలంటే గ్లామర్ తప్పనిసరి అయింది. ఒకటి రెండు సినిమాల వరకు నటిగా ఇమేజ్ తెచ్చుకున్నా అన్ని సినిమాలు అలంటి పాత్రలు రావు .. ఒకవేళ ఇప్పుడున్న కాంపిటీషన్ ని తట్టుకుని నిలబడాలంటే అందాలు ఆరబోయక తప్పదని తెలుసుకున్న భామలు ఇప్పటికే తమ అందాలతో జనాలను ఆకట్టుకున్నారు .. ఆలస్యంగా తెలుసుకున్న భామలు ఇప్పుడిప్పుడే లైన్ లోకి వస్తున్నారు. ఆ కోవలో బాలీవుడ్ లో సంచలన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా ఆ తరువాత పలు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దబాంగ్ తో ఘన విజయాన్ని అందుకున్న ఆమె తరువాత చాలా సినిమాల్లో నటిచింది. గ్లామర్ పాత్రలకు నో చెప్పడంతో అవకాశాలు తగ్గాయి. అయితే వరుస పరాజయాలతో ఈ అమ్మడికి కొత్తగా ఎవరు ఛాన్సులు ఇవ్వడం లేదు. దాంతో కాస్త బ్రేక్ తీసుకుని స్లిమ్ గా మారిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ గేట్లు తెరిచింది. ఇక పై గ్లామర్ పాత్రలకు నేను సిద్ధమని చెప్పకనే చెబుతూ హాట్ హాట్ ఆ ఫోటో షూట్ లతో షాకులు ఇస్తుంది. ప్రస్తుతం సోనాక్షి గ్లామర్ సోకులు చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఈ దెబ్బతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు ఖాయం అని అంటున్నాయి బి టౌన్ వర్గాలు.