పిక్ టాక్‌ : స‌్ట‌న్నింగ్ సోనాక్షి లుక్‌

Tuesday, April 24th, 2018, 03:18:13 AM IST

శ‌త్రుఘ్న‌సిన్హా వార‌సురాలిగా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన సోనాక్షి చాలా త‌క్కువ టైమ్‌లోనే అసాధార‌ణ స్టార్‌డ‌మ్ సంపాదించింది. షాట్ గ‌న్ క‌నుస‌న్న‌ల్లో బాలీవుడ్‌ని ఏల్తోంది ఈ అమ్మ‌డు. స‌ల్మాన్ లాంటి బిగ్ హ్యాండ్ సోనాక్షిని ప్ర‌మోట్ చేయ‌డంతో కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. ద‌బాంగ్‌, ద‌బాంగ్ -2 చిత్రాల్లో సోనాక్షి నాయిక‌గా అల‌రించ‌డంతో ప్ర‌స్తుతం `ద‌బాంగ్- 3`లోనూ మ‌రోసారి అవ‌కాశం అందుకుంది. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

ప‌నిలో ప‌నిగా సోనాక్షి న‌టిస్తున్న మ‌రో రెండు సినిమాలు రిలీజ్‌బ‌రిలోకి రానున్నాయి. హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ, క‌ళాంక చిత్రాలు ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉన్నాయి. ఓవైపు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా.. ఫోటోషూట్ల‌ను మాత్రం విడిచిపెట్ట‌డం లేదు. ప్ర‌ఖ్యాత `ఫెమినా` మ్యాగ‌జైన్ లేటెస్ట్ క‌వ‌ర్‌పేజీపై సోనాక్షి ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ వేష‌ధార‌ణ మునుపెన్న‌డూ లేనంతగా సంథింగ్ స్పెష‌ల్‌గా క‌నిపిస్తోంది. టాప్ టు బాట‌మ్ ఈ భామ‌లో ఇంత అందం దాగి ఉంద‌న్న విష‌యం ఇన్నాళ్లు లోకానికి తెలీదు. వేడెక్కించే ఫోటోషూట్లు ఎన్ని ఉన్నా.. ఇది వెరీ వెరీ స్పెష‌ల్‌.. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది ఈ స్పెష‌ల్ ఫోటో.

  •  
  •  
  •  
  •  

Comments