సోన‌మ్ “ఎఫైర్” ఎవ‌రితోనో తెలిస్తే షాకే!

Saturday, May 26th, 2018, 11:36:11 AM IST

స్టార్ డాట‌ర్ సోన‌మ్ క‌పూర్ త‌న బోయ్‌ఫ్రెండ్, దిల్లీ బిజినెస్‌మేన్ ఆనంద్ అహూజాని పెళ్లాడిన‌ సంగ‌తి తెలిసిందే.
ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డి ఎఫైర్ ఒక‌టి బ‌య‌టికొచ్చింది. ఇంత‌కీ సోన‌మ్ ఎఫైర్ ఎవ‌రితో? వివ‌రాల్లోకెళితే.. ఆస‌క్తిక‌ర సంగతులే తెలిశాయి.

సోన‌మ్ ప్ర‌స్తుతం సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్ `సంజు`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సోన‌మ్ పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్‌. ద‌త్ కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు.. యువ‌కుడైన సంజూభాయ్ అందాల క‌థానాయిక‌లు టీనా మునుమ్‌తో, మాధురి ధీక్షిత్‌తో ఎఫైర్లు సాగించాడ‌న్న ప్ర‌చారం బాలీవుడ్‌లో ఉంది. ఆ రెండు పాత్ర‌ల్లో ఒక పాత్ర‌లో సోన‌మ్ న‌టించిందిట‌. ఆ పాత్ర లుక్‌ని తాజాగా రిలీజ్ చేశారు. అంటే సంజూ పాత్ర పోషించిన ర‌ణ‌వీర్‌తో సోన‌మ్ వెండితెర‌పై ఎఫైర్ సాగించ‌నుంద‌ని అర్థం. రియాలిటీలో సోన‌మ్ ఎఫైర్ త‌న భ‌ర్త అహూజాతో మాత్ర‌మే. ప్ర‌స్తుతానికి కంగారేం లేదు. ఇక‌పోతే.. సంజు బ‌యోపిక్‌ని రాజ్‌కుమార్ హిరాణీ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments