సోనమ్ రింగ్ విలువ ఎంత తెలుసా?

Sunday, May 13th, 2018, 05:06:40 PM IST

సెలబ్రెటీల వివాహం జరిగితే అందుకు సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. ఎదో ఒక విధంగా పెళ్లిలో జరిగిన విషయాలు అందరిలో ఆసక్తిని రేపుతాయి. ఇక ఇటీవల జరిగిన సోనమ్ కపూర్ వివాహం కూడా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆనంద్ అహుజా లాంటి శ్రీమంతుడిని వివాహమాడిన సోనమ్ చాలా అదృష్టవంతురాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

ఎందుకంటే ఆనంద్ అహుజాకు 3000 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఎన్నో ఫ్యాక్టరీలకు ఒకే ఒక్క అధినేత. ఇకపోతే నిశ్చితార్ధం వేడుకలో సోనమ్ కు ఆనంద్ తొడిగిన రింగ్ విలువ ఎంతో తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. 90 లక్షల విలువగల డైమండ్ రింగ్ ను ఆమె కోసం స్పెషల్ గా రెడీ చేయించారట. వేల కోట్ల ఆస్తులు కలిగిన ఆనంద్ అహుజా అలాంటి కాస్ట్లీ రింగ్ ప్రజెంట్ చేయడం మంటే పెద్దగా ఆశ్చరపోవాల్సిన అవసరం లేదనుకుంటా!

  •  
  •  
  •  
  •  

Comments