సోన‌మ్ వెడ్స్ అహూజా పెళ్లి ఫిక్స్‌

Saturday, March 24th, 2018, 09:09:10 PM IST

ఎట్ట‌కేల‌కు అందాల కుంద‌న‌పు బొమ్మ సోన‌మ్ పెళ్లి ఖాయ‌మైంది. ఇది డెస్టినేష‌న్ వెడ్డింగ్ .. మే 11 & 12 తేదీల్ని లాక్ చేసేశారు. `విరుష్క‌` త‌ర‌హాలోనే విదేశాల్లోనే పెళ్లి ఉంటుంద‌న్న‌ది తాజా వార్త‌. విరాట్ – అనుష్క శ‌ర్మ జంట ట‌స్క‌నీలో ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సేమ్ టు సేమ్ .. సోన‌మ్ – అహూజా విష‌యంలోనూ అదే త‌ర‌హా ఏర్పాట్లు సాగుతున్నాయి. అంతా గుట్టు చ‌ప్పుడు కాకుండానే కానిచ్చేస్తున్నారు. ఇప్ప‌టికే పెళ్లి దుస్తుల నుంచి ప్ర‌తిదీ ఆర్డ‌ర్ ఇచ్చేశారు. జువెల‌రీ డిజైన్స్‌ రెడీ అయిపోతున్నాయి. ఇక‌పోతే పాపా అనీల్ కుమార్‌ తాజాగా వెన్యూ కూడా క‌న్ఫామ్ చేసేశార‌ని తెలుస్తోంది.

తొలుత ఈ పెళ్లి ఉద‌య్‌పూర్ లేదా ఉత్త‌రాదిన ఏదో ఒక చోట సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా చేసేయాల‌నుకున్నారు. కానీ ఆ త‌ర్వాత డెస్టినేష‌న్ వెడ్డింగ్ అయితే బావుంటుంద‌ని, అందుకు జెనీవా లాంటి ఖ‌రీదైన దేశం అయితే బావుంటుంద‌ని సోన‌మ్ భావించిందిట‌. ఆ మేర‌కు ఇప్ప‌టికే అక్క‌డ వెన్యూ కోసం సెర్చ్ పూర్త‌యిందిట‌. సోద‌రి రియాతో క‌లిసి జ‌న‌వ‌రి ట్రిప్‌లోనే వెన్యూని ఫైన‌ల్ చేసేశారట‌. సోన‌మ్ ఆస్ట్రియాలో స్పా ట్రీట్‌మెంట్ కోసం ప్రిప‌రేష‌న్‌లో ఉందని తెలుస్తోంది. ఈ వివ‌రాన్ని బ‌ట్టి ఆనంద్ అహూజాతో రెండేళ్లుగా సాగుతున్న డేటింగ్‌కి ఇక ఫుల్‌స్టాప్ ప‌డే స‌మ‌యం ఆస‌న్న‌మైందని అర్థ‌మ‌వుతోంది. ఆనంద్ దిల్లీకి చెందిన లండ‌న్ బేస్డ్ బిజినెస్‌మేన్‌.