సోనమ్ కి కాబోయే వరుడి ఆస్థి రూ.3000 కోట్లా?

Sunday, April 29th, 2018, 01:36:31 PM IST

సీనియర్ నటుడు అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్, రణబీర్ కపూర్ తో కలిసి నటించిన సావరియా సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. అప్పటినుండి కొన్ని ఒడిడుకులు ఎదుర్కున్న సోనమ్ ఆ తరువాత వచ్చిన చిత్రాల్లో మంచి పాత్రలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించింది. అయితే ఆమె తర్వలో పెళ్లి కూతురు కానున్నట్లు తెలుస్తోంది. ఆమె తన మిత్రుడు ఆనంద్ అహూజా తో వచ్చేనెల మొదటి వారంలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికీ సోనమ్ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ నోరు విప్పలేదు. ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే మాత్రం, పెద్దగా ఖర్చు లేకుండా చాలా సదా సీదాగా ఇంట్లోని వారందరి సమక్షంలో చేసుకుంటా అని అన్ని ఆమె కొంత కలం క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

కాగా ఆమె చేసుకోనున్న ఆనంద్ సాధారణ కుబేరుడు కాదట ఏకంగా రూ.3000 కోట్ల రూపాయల ఆస్తికి వారసుడని అంటున్నారు. ఈయన తండ్రి హరీష్ అహూజా అతి పెద్ద వ్యాపారవేత్త, మరియు భరత్ లోని అతిపెద్ద ఎక్స్ పోర్ట్స్ కంపెనీ అయిన షాహీ ఎక్స్ పోర్ట్స్ కంపెనీ కి అధిపతి. ఆనంద్ కు అమిత్, అనంత్ అనే ఇద్దరు సోదరులున్నారు. ఢిల్లీ లోని అమెరికన్ ఎంబసీ స్కూల్ లో చదివిన ఆయన, పెన్సిల్ వేనియా యూనివర్సిటీ లో ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసినట్లు తెలుస్తోంది. అలానే ఆతరువాత వార్డెన్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ చేసారు. తరువాత అమెరికాలోని అమెజాన్ కంపెనీ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్లకు ప్రోడక్ట్ మేనేజర్ గా పనిచేశారు. ఆయనకు 2014లో తన స్నేహితురాలు ప్రేరణ ద్వారా సోనమ్ పరిచయమయిందట. కొన్నాళ్ల పరిచయం తర్వాత ఒక రోజు సోనమ్ కు లవ్ ప్రపోజ్ చేశారట ఆనంద్. అయితే ఆమె దానికి ఒప్పుకోవటానికి కొన్ని నెలలుపట్టిందని సమాచారం. మంచి యువ పారిశ్రామిక వేత్త అయినా ఆనంద్ అహుజాకు ఆటలంటే మంచి ఇష్టమట , అందునా బాస్కెట్ బాల్ అంటే మరింత ప్రేమట……

  •  
  •  
  •  
  •  

Comments