రాజు గెటప్ లో అదిరిపోయిన సోనూ సూద్.. ఇంతకీ ఏ సినిమా ఇదీ..?

Wednesday, April 11th, 2018, 12:21:17 PM IST

ఎలాంటి వేషం వేసినా, ఎలాంటి పాత్ర ఇచ్చినా కొంద‌రు న‌టీన‌టులు ఏ పాత్ర‌ల‌లోనైన ఇట్టే ఒదిగిపోతారు. అలాంటి వారిలో సోనూ సూద్ కూడా ఒక‌రు. అరుంధ‌తి చిత్రంలో ప‌శుప‌తిగా ఆయ‌న న‌ట‌న అసలు మాటలకి చిక్కనిది. ప్ర‌తినాయ‌కుడిగానే ఎక్కువ పాపుల‌ర్ అయిన సోనూ మ‌ణికర్ణిక చిత్రంలో మ‌రాఠీ రాజు పాత్ర పోషిస్తున్న‌ట్టు తాజా స‌మాచారం. రాజు పాత్ర‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. సోనూ సూద్ చూసిన అభిమానులు ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌ణిక‌ర్ణిక చిత్రం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా వచ్చే ఆగస్టులో రిలీజ్ కావడానికి సర్వత్రా సిద్దమైంది. ఝాన్సీ ల‌క్ష్మీ బాయ్ జీవిత నేప‌థ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ చిత్రానికి క‌థ అందించారు. ఇక ఈ కొత్తరకం పాత్ర సోనూసూద్ కి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.

  •  
  •  
  •  
  •  

Comments