రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్..!

Saturday, April 17th, 2021, 03:12:59 PM IST

బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన సోనూసూద్ మొదటి సారి కరోనా బారిన పడ్డారు. ఈ రోజు ఉదయం కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్టు సోనూసూద్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉంటున్నానని, తన ఆరోగ్యం బాగానే ఉందని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

ఇదిలా ఇంటే ఇటీవల సంజీవని అనే కోవిడ్ టీకా డ్రైవ్‌ను ప్రారంభించిన సోనూసూద్ ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నాడు. అయినప్పటికి ఆయనకి కరోనా సోకింది. పంజాబ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుంది. ఇక ప్రస్తుతం సోనూసూద్ ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఎంతో మందికి సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ కరోనా బారిన పడడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్షిస్తున్నారు.