కోహ్లీకి ధోని అవసరం చాలా ఉంది.. సౌరవ్ గంగులి కౌంటర్

Saturday, October 21st, 2017, 08:40:00 PM IST

క్రికెట్ చరిత్రలో ధోని ఏ స్థాయిలో రికార్డులను తిరగరాసాడో అందరికి తెలిసిన విషయమే. భారత క్రికెట్ జట్టుకు కీపర్ కరువైనప్పుడు ధోని ఎంట్రీ అందరికి ఆనందాన్ని ఇచ్చింది. అంతే కాకుండా ఒక స్పీడ్ బ్యాట్స్ మెన్ కూడా దొరికాడని సంబరపడిపోయింది ఇండియా టీమ్. వచ్చిన కొద్దీ కాలానికే కెప్టెన్ గా బాధ్యతలను చేప్పట్టిన ధోని వరల్డ్ కప్ లను అందించి దేశ ఖ్యాతిని పెంచాడు. కెప్టెన్ గా తప్పుకున్నా ఇంకా తన ఆలోచనతో జట్టుకు సహాయాలను అందిస్తున్నాడు. అయితే రీసెంట్ గా కొంతమంది ధోనీపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలకు భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ కౌంటర్ వేశారు. ధోని అవసరం కోహ్లీ కి ఇంకా చాలా ఉందని తెలుపుతూ.. ధోని ఇంకా జట్టుకు కావాలని తెలిపాడు. అంతే కాకుండా కరెక్ట్ ఫిట్ నెస్ తో ఉంటే ధోని 2019 వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.