సొంతగడ్డపై సౌతాఫ్రికా ఆదరగోడుతుంది…

Saturday, March 10th, 2018, 05:50:22 PM IST

చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు దుమ్ము దుమారం రేపుతున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 243 పరుగులకే చల్లబరచి ముంజేయి సాధించిన సఫారీ జట్టు బ్యాటింగ్‌లోనూ ఏకధాటిగా ఆడుతున్నారు. జట్టు స్కోరు 22 దగ్గర ఓపెనర్ మార్‌క్రమ్(11), 67 పరుగుల వద్ద కగిసో రబాడ(29) వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆసీస్ బౌలర్లను ఆదరగోట్టేలా ఆడుతూ అపోజిషన్ టీం వాళ్ళని ఎదుర్కొంటూ ఓపెనర్ డీన్ ఎల్గర్, సీనియర్ బ్యాట్స్‌మన్ ఆమ్లా భారీ భాగస్వామ్యం నెలకొల్పేలా ఆతను కొనసాగిస్తున్నారు.

చేతికొచ్చిన బంతులను చితక బాదుతూ.. మధ్య మధ్యలో సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డకే కిక్కిస్తున్నారు. పాట్ కమిన్స్ మినహా మిగతా బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేస్తున్నారు. అతనొక్కడే రెండు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా కట్టడి చేస్తున్నాడు. 44 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఎల్గర్(42), ఆమ్లా(32) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ప్రస్తుతం సౌతాఫ్రికా 127 పరుగులు వెనుకబడి ఉంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments