కోహ్లీ సేన..స్నానం రెండు నిమిషాల్లోనే చేయాలి : దక్షిణాఫ్రికా

Friday, January 5th, 2018, 12:05:57 AM IST

కొత్త ఏడాది భారత జట్టు మొదట టెస్టు మ్యాచ్ తో సఫారీ సిరీస్ ను మొదలు పెట్టనుంది. ఎలాగైనా 2018ని మంచి విన్నింగ్ గేమ్ తో విజయ యాత్రను స్టార్ట్ చేయాలనీ కోహ్లీ సేన చాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం భారత జట్టు అన్ని అంశాల్లోను చాలా బలంగా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే మొదటి టెస్టు కేప్‌టౌన్‌లో జరగబోతోన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ కేవలం భారత జట్టు ఆటగాళ్లు రెండు నిముషాలు మాత్రమే స్నానం చేయాలని దక్షిణాఫ్రికా సూచించింది. అక్కడి ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. దీంతో జట్టు సభ్యులు అర్ధం చేసుకోవాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ రిక్వెస్ట్ చేసిందట. దీంతో ఆటగాళ్లు రెండు నిమిషాలకంటే ఎక్కువ సేపు స్నానం చేయడం లేదట. అంతే కాకుండా తమకు ఆట ఒక్కటే ముఖ్యమని విజయం సాధించడం పైనే మా దృష్టి ఉందని ఇతర విషయాలు ఎక్కువగా పట్టించుకోమని ఇటీవల ఇండియన్ క్రికెట్ టీమ్ సభ్యులు ఒక మీడియాకి తెలియజేశారు.