ఇందిరా గాంధీ ఆ దేశం నుండి భారీగా డబ్బులు తీసుకుందా…!

Thursday, January 26th, 2017, 02:57:25 PM IST

indira-gandhi
మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో పార్లమెంట్ లో ఉన్న 40% ఎంపీ లకు అప్పట్లో సోవియట్ లోని మాస్కో నుండి భారీగా నగదు అందినట్టు వస్తున్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. కేజిబి రికార్డుల నుండి 2005లో లీక్ అయిన ఈ సమాచారాన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ) ఇప్పుడు బహిర్గత పరచింది. 1985 ప్రాంతంలో సోవియట్ భారత దేశ నాయకులకు భారీగా నగదు ఇచ్చి భారతదేశ రాజకీయాలలో జోక్యం చేసుకున్నట్టు సిఐఎ చెప్పింది.

ఇందిరా గాంధీ చివరిసారిగా ప్రధానిగా చేసిన హయాంలో ఆమె ప్రభుత్వంలోని దాదాపు 40% మందికి సోవియట్ నుండి నిధులు అందినట్టు చెప్పింది. సోవియట్ ఎంబసీ లో కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడానికి, ఇతరత్రా కారణాల కోసం ఎప్పుడు డబ్బు రెడీ గా ఉండేదని ఈ రిపోర్ట్ లో ఉంది. 2005లో కేజిబి రికార్డ్స్ లోని వేలాది డాకుమెంట్స్ ను వాసిలి అనే అయన వెలుగులోకి తీసుకొచ్చారు. ‘కేజిబి’ సంస్థ నుండి ఇందిరా గాంధీ కి డబ్బు అందేదని, ఆ డబ్బును ఎన్నికల ప్రచారం కోసం మాజీ కేంద్ర మంత్రి వీకే కృష్ణ మీనన్ ఇంకా నలుగురు కేంద్ర మంత్రులకు అందినట్టు ఈ రికార్డ్స్ లో ఉంది.

ఈ డబ్బును ఇండియాకు తరలించడానికి భారత్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను ఉపయోగించుకున్నట్టు ఈ రికార్డ్స్ చెప్తున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాక కమ్యూనిస్ట్ పార్టీలైన సిపిఐ, సిపిఎం లకు కూడా భారీగానే నిధులు అందేవి. ఈ నిధులను కూడా అందరి నాయకులకు ఇవ్వలేదని గాంధీ కుటుంబానికి కూడా లొంగని కొంతమంది పలుకుబడి కలిగిన నాయకులకు మాత్రమే ఈ నిధులు అందేవని ఈ రికార్డ్స్ లో ఉంది. ఈ నిధులను అందించడం ద్వారా మాస్కో మన దేశ రాజకీయాలలో ప్రతీ దానిలో ఇన్వాల్వ్ అయినట్టు ఈ రికార్డ్స్ ద్వారా మనకు తెలుస్తుంది.