బూటుతో తన చెంప తానే వాయించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి !

Monday, January 30th, 2017, 10:24:19 PM IST

up-mla
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులంతా ఎవరికి వారు ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాగా సమాజ్ వాదీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా ప్రవర్తించాడు. షుజాత్ ఆలం అనే సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి విచిత్ర ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

షూజిత్ గతంలోనూ ఎన్నికల్లో పోటీచేసి రెండుసార్లు ఓటమి చెందాడు.ఈ సారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తాను గతంలో ఏవైనా తప్పులు చేసి ఉంటె క్షమించాలని ప్రజలను కోరుతూ బూటుతో తనని తానె చెంప దెబ్బలు కొట్టుకున్నాడు. తాను గతంలో చేసిన తప్పులకు క్షమించి తనకు ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను కోరాడు. అతడు బూటుతో కొట్టుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.