కాంగ్రెస్ సీఎల్పీ వీలీన సూత్ర‌ధారి ఎవ‌రు?

Friday, June 7th, 2019, 07:09:54 PM IST

తెరాస గూటికి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరి సీఎల్పీని తెరాస విలీనం చేయాలంటూ స‌భ‌ప‌తిని కోర‌డం, ఇందుకు ఆయ‌న వెంట‌నే ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం గురువారం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. దీని వెన‌క పెద్ద త‌తంగ‌మే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ విలీన ప్ర‌క్రియ‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారిగా మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత చేవెళ్ల చెల్లెమ్మ‌గా వైఎస్ హ‌యాంలో పాపుల‌ర్ అయిన స‌బితా ఇంద్రారెడ్డి వున్న‌ట్టు తెలిసింది. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల త‌రువాత జ‌రిగిన అనుహ్య ప‌రిణ‌మాల త‌రువాత స‌బితా ఇంద్రారెడ్డి త‌న త‌న‌యుడు కార్తీక్‌రెడ్డితో క‌లిసి తెరాస‌లోకి జంప్ అయిన విష‌యం తెలిసిందే.

తెరాస‌లో చేరిన ద‌గ్గ‌రి నుంచి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా సైలెంట్‌గా వుంటున్న స‌బితా ఇంద్రారెడ్డి త‌న మంత్రాంగంతో కాంగ్రెస్ సీఎల్పీని తెరాస‌లో విలీనం చేసేందుకు ప‌క్కాగా ప్ర‌ణాళిక‌ను ముందుండి న‌డిపించారని, విలీన సంద‌ర్భంగా ప‌త్రాలు స‌మ‌ర్పిస్తున్న సంద‌ర్భంలోనూ ఆమె ముందుండ‌టంతో ఆమె పాత్ర‌పై పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నాయి. అన్న‌ట్టు స‌బిత ఇంత రిస్క్ తీసుకోవ‌డానికి అస‌లు కార‌ణం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఈ విస్త‌ర‌ణ‌లో స‌బితా ఇంద్రారెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు కేసీఆర్ మాటిచ్చార‌ట‌. అందుకే ఆమె ఇదంతా చేసింద‌ని చెబుతున్నారు. స‌బిత‌కు కీల‌క మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెడితే తెరాస‌లో అస‌మ్మ‌తి రాజు కోవ‌డం ఈ సారి త‌ధ్యం అని తెరాస పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఎంతో కాలంగా పార్టీని న‌మ్ముకుని ఉన్న విన‌య్ భాస్క‌ర్ లాంటి వాళ్ల‌కు ఈ ద‌ఫా మొడి చేయి చూపిస్తే పార్టీలో అస‌మ్మ‌తి సెగ‌లు తారా స్థాయికి చేర‌డం ఖాయ‌మనే వాద‌న వినిపిస్తోంది.