దేశ చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ మైలురాయి గా నిలుస్తుంది!

Tuesday, June 2nd, 2020, 07:38:04 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరు పై స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలు లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అని వ్యాఖ్యానించారు.అంతేకాక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం కేసీఆర్ ఎలా రాష్ట్రాన్ని నడిపిస్తారు అనే విషయాల పై ప్రతి పక్ష పార్టీ నేతలు చేసిన విమర్శలను మరొకసారి గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టీ కేసీఆర్ వారికి గట్టి సమాధానం ఇచ్చారు అని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ను సాధించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో రాష్ట్ర ప్రజలకు శుభాకంక్షలు తెలియజేశారు.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉపయోగ పడేవిధంగా రైతు బీమా,రైతు బందు వంటి పధకాలను ప్రకటిస్తూ దేశం లో ఎక్కడా లేని విధంగా వారికి సహయాం చేస్తున్నారు అని కొనియాడారు.అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, దేశ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ మైలు రాయి గా నిలుస్తుంది అని వ్యాఖ్యానించారు.అయితే ప్రజల కోసం, రైతుల కోసం, వారిని ఆర్దికంగా ముందుకు తీసుకెళ్ళే విధంగా నియంత్రిత సాగు విధానం ను అమలు చేస్తుంటే ప్రతి పక్ష పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.