జగన్ శుక్రవారం కోర్టు హాజరుపై కీలక తీర్పు

Saturday, September 21st, 2019, 07:57:41 AM IST

జగన్ మోహన్ గత కొన్నేళ్లుగా ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకి వ్యక్తిగతంగా హాజరవుతూనే ఉన్నాడు. అక్రమాస్తుల కేసుల నేపథ్యంలో అతని మీద విచారణ కొనసాగుతుంది. ఎక్కడ ఉన్న కానీ కోర్టుకి మాత్రం తప్పకుండా హాజరు కావాలి. ఏమైనా ఒక వారం రెండు వారలు మినహాయింపు కావాలంటే కోర్టు అనుమతి ముందుగా తీసుకోవాలి. అయితే జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం అయినా తరువాత ఇంత వరకు కోర్టుకి వెళ్ళలేదు.

దీనిపై రెండు వారలు క్రితం తాను సీఎం అయినందువలన వారం వారం కోర్టుకి రావటం ఇబ్బందిగా ఉంది. సీఎం హోదాలో అక్కడకి రావాలంటే ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఏపీ పరిస్థితి సరిగ్గా లేదు. ఇలాంటి తరుణంలో ఈ ఖర్చు భారం అవుతుంది, కాబట్టి ప్రతి వారం కోర్టుకి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు కావాలి, నా తరుపున నా లాయర్ వస్తాడంటూ జగన్ పిటిషన్ దాఖలాలు చేశాడు. అసలు జగన్ చేసిన పిటిషన్ విచారణకి తీసుకోవటానికి అర్హత ఉందా..? లేదా..? అనే దానిపై విచారణ జరిగింది.

గతంలో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసినందున ఇప్పుడు మళ్లీ ఎలా పిటిషన్ ను విచారించాలని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని వివరిస్తూ జగన్ తరపు లాయర్.. తన వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్ ని విచారణకి తీసుకొనివటానికి అనుమతి ఇచ్చాడు. గతంలో పాదయాత్ర సమయంలో ఇలాగే పిటిషన్ వేస్తే దానిని కొట్టిపేడేసింది కోర్టు. కానీ ఇప్పుడు పిటిషన్ ని విచారణకి అనుమతి ఇవ్వటం విశేషం.