వార‌ణాశిలో ‘ఖైదీనంబ‌ర్ 150’ స‌క్సెస్‌ పూజ‌లు

Friday, December 30th, 2016, 06:07:52 PM IST

poja
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 150వ సినిమా `ఖైదీనంబ‌ర్ 150` విజ‌యం కోసం అఖిల భార‌త చిరంజీవి యువ‌త తెలుగు రాష్ట్రాలు స‌హా, దేశంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల్లో పూజ‌లు, హోమాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు ద‌శ‌ల్లో ఈ పూజా కార్య‌క్ర‌మాలు దిగ్విజ‌యంగా సాగాయి.

తాజాగా ప‌విత్ర గంగాన‌ది ప్ర‌వ‌హించే కాశీనాధుని స‌న్నిధానంలో.. వార‌ణాసిలో గ్రాండ్‌గా పూజ‌లు, హోమాలు నిర్వ‌హిస్తున్నామ‌ని అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు ర‌వ‌ణం స్వామినాయుడు ప్ర‌క‌టించారు. ఐద‌వ సిరీస్ పూజా కార్య‌క్ర‌మాలివ‌ని తెలిపారు. ఐదో సిరీస్ పూజాకార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments