స్పీల్‌బ‌ర్గ్ `రెడీ వ‌న్‌ ప్లేయ‌ర్`@ 2600 కోట్లు

Tuesday, April 10th, 2018, 09:13:22 PM IST

లెజెండ‌రీ స్పీల్‌బ‌ర్గ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. డైనోసార్ల సృష్టిక‌ర్త‌గా, `జురాసిక్ పార్క్` సినిమాల మేక‌ర్‌గా సృజ‌నాత్మ‌క ద‌ర్శ‌క‌దిగ్గ‌జంగా ఆయ‌న‌ అందుకోని హైట్స్ లేవంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటి మేటి ద‌ర్శ‌క‌నిర్మాత నుంచి ఓ సినిమా వ‌స్తోంది అంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందుకు త‌గ్గ అంచ‌నాలుంటాయి. ఆ కోవ‌లోనే ఇటీవ‌లే స్పీల్‌బ‌ర్గ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచిన `రెడీ వ‌న్ ప్లేయ‌ర్` వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ వ‌ద్ద రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా ఇప్ప‌టికే 2600 కోట్లు (400 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేసింది.

`రెడీ వ‌న్‌ ప్లేయ‌ర్` కేవ‌లం ఆసియా ఖండంలోని చైనా నుంచి ఏకంగా 1040 కోట్లు (163 మిలియ‌న్ డాల‌ర్లు ) వ‌సూలు చేయ‌డం మ‌రో సెన్సేష‌న్‌. అటువైపు అమెరికాలోనూ ఈ సినిమా సంచ‌ల‌న వ‌సూళ్లు సాధించింది. బ్లాక్ పాంథ‌ర్ త‌రవాత అంత‌టి గొప్ప విజ‌యం సాధించిన రీసెంట్ మూవీగా రికార్డుల‌కెక్కింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇండియాలో ఎలాంటి హ‌డావుడి లేక‌పోవ‌డ‌మేంటో ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఇక‌పోతే స్పీల్‌బ‌ర్గ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా, ఇన్విజిలేట్ చేసిన `జురాసిక్ వ‌ర‌ల్డ్ 2` ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments