ఓపెనింగ్ డే: `స్పైడ‌ర్‌` అమెరికా వ‌సూళ్లు 6.37 కోట్లు

Wednesday, September 27th, 2017, 01:12:49 PM IST

ఓవ‌ర్సీస్‌లో మ‌హేష్ హ‌వా ఎలా ఉంటుందో తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన‌ స్పైడ‌ర్ అమెరికాలో సంచ‌ల‌న వ‌సూళ్లు సాధించ‌డం ఖాయం అని రిలీజ్ ముందే అంచ‌నా వేశారు. ఓపెనింగ్ డే మ‌హేష్ కెరీర్ బెస్ట్ క‌లెక్ష‌న్స్ అందుకుంటాడ‌న్న అంచ‌నాలు వేశారు. అయితే అమెరికాలో మ‌హేష్ స‌త్తా ఎంత‌? అన్న‌దానిపై తాజా అప్‌డేట్ అందింది.

మ‌హేష్ హ‌వా అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద ఓ రేంజులో న‌డుస్తోంద‌ని ట్రేడ్ రిపోర్ట్ వెల్ల‌డించింది. ఓవ‌ర్సీస్‌లో మ‌రోసారి మ‌హేష్ స‌త్తా చాటాడు. ప్ర‌ఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ డే1 వ‌సూళ్ల వివ‌రాల్ని అంద‌జేశారు. స్పైడ‌ర్ తొలిరోజు అమెరికాలో ఏకంగా 6.36 కోట్లు (9,68,064 డాట‌ర్లు) వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. తుఫాన్ వ‌సూళ్లు ఇవి అంటూ ట్వీట్ చేశారు త‌ర‌ణ్‌. ఇక అమెరికాలో తొలి వీకెండ్ నాటికి ఇంత‌కు రెట్టింపు వ‌సూళ్లు సాధించే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్‌లో అంచ‌నాలు వేస్తున్నారు. ఈ ఫ‌లితం మ‌హేష్‌కి మ‌రింత ఉత్సాహాన్నిచ్చేదే. తెలుగు రాష్ట్రాల వ‌సూళ్ల వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments