స్పైడర్ ఇన్సైడ్ టాక్ … మహేశ్ ఫ్యాన్స్ కి పునకాలే!

Sunday, September 24th, 2017, 07:49:59 PM IST

మరో రెండు రోజుల్లో స్పైడర్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. సూపర్ స్టార్ మహేశ్ కెరియర్ లో సరికొత్త కథాంశంతో చాలా తక్కువ బజ్ తో ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో ఫ్యాన్స్ కాస్తా నిరుత్సాహంగా ఉన్న మాట వాస్తవమే అయిన, ఈ సినిమా గురించి ఇప్పుడు వినిపిస్తున్న టాక్ తెలిస్తే మాత్రం ఫ్యాన్స్ పునకాలు రావడం గ్యారెంటీ.

స్పైడర్ సినిమా మహేశ్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. అలాగే మురుగదాస్ కూడా మహేశ్ ని ఈ సినిమా కోసం చాలా కొత్తగా చూపించడానికి ట్రై చేసాడు. ఈ సినిమాలో మహేశ్ ని ఇప్పటి వరకు చూడని మరో యాంగిల్ చూస్తారని టాక్ వినిపిస్తుంది. ఇక మహేశ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా అద్బుతంగా ఉంటుందని కూడా చెప్పుకుంటున్నారు. కథ చాలా కొత్తగా ఉండటంతో పాటు , హాలీవుడ్ మేకింగ్ ని తలపిస్తుందని, ఈ సినిమాతో మహేశ్ నేషనల్ స్టార్ అయిపోవడం గ్యారెంటీ అని అందరు చెప్పుకుంటున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా అద్బుతంగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సినిమా మహేశ్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని, అలాగే సినిమాతో మహేశ్ తెలుగు నుంచి రికార్డు స్థాయి కలెక్షన్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సినిమాలో రొమాంటిక్ ట్రాక్ తక్కువగా ఉన్న అని సినిమా మీద ప్రభావం చూపించదని కూడా తెలుస్తుంది. ఇక సినిమాకి కథే బలం అని, కేవలం మహేశ్ ఫ్యాన్స్ సినిమాకి వచ్చే టైం లో ఏదో ఆశించి వస్తారని, అలా రాకుండా వచ్చి సినిమాలో మహేశ్ చూపించిన వేరియేషన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని సినిమా మీద హైప్ తగ్గించినట్లు తెలుస్తుంది. మొత్తానికి బయట వినిపిస్తున్న టాక్ బట్టి అయితే స్పైడర్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments