హిట్టా లేక ఫట్టా : స్పైడర్ ట్రెండీ టాక్- మహేష్ చేసిన మరో ప్రయోగం!

Wednesday, September 27th, 2017, 06:00:18 PM IST


సూపర్ స్టార్ మహేశ్ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది అంటే ఏదో కొత్తదనం ఉంటుంది అనే రేంజ్ లో అతని గత సినిమాలు ఎస్టాబ్లిష్ తీసుకొచ్చాయి. అతను స్టార్ హీరో రేంజ్ లో ఉండి కూడా ప్రయోగాత్మక కథలకి పెద్ద పీట వేస్తూ తాను మాత్రం చాలా ప్రత్యేకం అని నిరూపించుకుంటారు. అలా మహేశ్ నుంచి, మురుగదాస్ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో వచ్చిన సినిమా స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అయితే సినిమా మీద పెద్దగా హైప్ క్రియేట్ చేయకుండా తీసుకొచ్చిన ఈ సినిమా ట్రెండీ టాక్ ఎలా ఉందంటే.

మురుగదాస్ ఎప్పుడు ఎవరికీ అందని సరికొత్త కథలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తాడు. స్పైడర్ విషయంలో కూడా అలాగే చేసాడు. మనిషిలో ఉండే పైశాచికత్వం హద్దులు దాటిపోతే అతను సమాజానికి ఎలా ప్రమాదకరంగా మారుతాడు అనే విషయాన్ని తనదైన శైలిలో కమర్షియల్ అంశాలు జోడించి చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ సినిమాలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా మహేశ్ ఇప్పటి వరకు కనిపించని విధంగా స్టార్ స్టేటస్ పక్కన పెట్టి చేసాడని వినిపిస్తుంది.. దీంతో ఆ పాత్ర చాలా బలంగా కనిపిస్తుంది. దాంతో పాటు విలన్ గా చేసిన ఎస్.జే. సూర్య తన సైకిక్ పెర్ఫార్మెన్స్ సినిమాలో మంచి థ్రిల్ తీసుకొచ్చాడని సమాచారం. బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ వీక్ గా ఉన్న పాత్రల చిత్రీకరణ సంతోష్ శివన్ విజువల్ ట్రీట్ మాత్రం తెలుగు ప్రేక్షకులకి కొత్తగా ఉండి ఆకట్టుకున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా కాస్తా హై ఇంటలిజెన్స్ తో నడిచే ఓ రకమైన సైకిక్ థ్రిల్లర్ గా సినిమా ఉన్నట్లు తెలుస్తుంది.

 

స్పైడర్ – మహేష్ నుండి మంచి ప్రయత్నం

Reviewed By 123telugu.com |Rating : 3.25/5

స్పైడర్ – క్రాకింగ్ థ్రిల్లర్

Reviewed By indiatimes.com |Rating : 2/5

స్పైడర్ – మురుగదాస్ మేకింగ్ విజన్

Reviewed By firstpost.com |Rating : 3/5

స్పైడర్: మహేశ్ బాబు కి మరో పరాజయం

Reviewed By chitramala.in |Rating : 2.5/5

స్పైడర్ – మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే స్పైడర్..!

Reviewed By apherald.com |Rating : 2.5/5

స్పైడర్ – మహేష్ నుంచి వచ్చిన ఓ మంచి ప్రయత్నం స్పైడర్

Reviewed By andhravilas.net |Rating : 2.75/5

స్పైడర్ – మహేశ్ కెరియర్ లో గుర్తుండిపోయే చిత్రం

Reviewed By indiaglitz.com |Rating : 2.75/5

స్పైడర్ – స్పైసీ తక్కువగా ఉంది.

Reviewed By greatandhra.com |Rating : 2.5/5

స్పైడర్.. ఓకే అనిపిస్తుంది సగంలో దారి తప్పాడు!

Reviewed By tupaki.com |Rating : 2.75/5

స్పైడర్ – స్పైసీ లేదు

Reviewed By gulte.com |Rating : 2.5/5

స్పైడర్ – గొప్ప సినిమా అయితే కాదు కాని చూడొచ్చు

Reviewed By hindustantimes |Rating : 2/5

స్పైడర్: ప్రేక్షకుల అడుగులతో స్పైడర్ ని తుడిచేస్తారు

Reviewed By tollywood.net |Rating : 3/5

స్పైడర్ – తమిళంలో భారీ హిట్‌గా మారే అవకాశం ఉంది.

Reviewed By telugumirchi.com |Rating : 3/5

పాథెటిక్ క్రైమ్ త్రిల్లర్

Reviewed By teluguone.com |Rating : 2/5


 

 Comments