బాలీవుడ్ లో స్పైడర్.. బాగా నచ్చిందట!

Tuesday, June 12th, 2018, 05:57:51 PM IST

గత ఏడాది మహేష్ బాబు – మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమా ఏ స్థాయిలో పరాజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా మహేష్ కు ఊహించని డిజాస్టర్ ని అందించింది. అయితే ఈ సినిమా తమిళ్ కూడా రిలీజ్ చేయగా అక్కడ పరవాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ ను అందుకుంది. ఇకపోతే ఈ కథ ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు. స్పైడర్ దర్శకుడు మురగదాస్. తన కెరీర్లో బాగా నచ్చిన కథల్లో అదొకటి అని చెబుతూ త్వరలో హిందీలో రీమేక్ చేయనున్నట్లు మురగదాస్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. గతంలోనే స్పైడర్ సినిమాను బాలీవుడ్ డబ్ చేసి రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో వెనకడుగు వేశారు. ఇక ఇప్పుడు మురగదాస్ సౌత్ లో ఫెయిల్ అయినా కథను సరికొత్తగా బాలీవుడ్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.