బాలీవుడ్ కి వెళ్లనున్న మహేష్ ‘స్పైడర్’ ?

Friday, September 29th, 2017, 03:05:51 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 51 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. తమిళ్ లో కూడా స్పైడర్ పరవాలేదనిపించే విధంగా నడుస్తోంది. బుధవారం రిలీజ్ అయిన స్పైడర్ మిక్సిడ్ టాక్ తో వెళుతోంది. సెలవులు ఉండడంతో కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకు ఎటువంటి నష్టం వాటిల్లదు అనే టాక్ వినిపిస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే స్పై డర్ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయ్యే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ స్పైడర్ లోను మహేష్ నటిస్తాడు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అందుకు సంబందించిన విషయం చిత్ర యూనిట్ ద్వారా మరో 10 రోజుల్లో తెలియనుంది. సాధారణంగా దర్శకుడు మురగదాస్ తన కథలను ఇతర బాషలలో తెరకెక్కించడానికి చాలా ఇష్టపడతాడు. ఇంతకుముందు కూడా గజినీ సినిమాను బాలీవుడ్ లో ఆ దర్శకుడే తెరకెక్కించాడు. మరి స్పైడర్ ను ఎవరితో తెరకెక్కిస్తాడో చూడాలి.

Comments