స్పైడర్ స్టొరీ… వర్మ కథకి… మురుగదాస్ టచ్ అప్! వాట్ నెక్స్ట్!

Thursday, September 28th, 2017, 06:31:12 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ బ్రహ్మరధం పడతారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో అతని స్టైల్, మేకింగ్ విజన్ చాలా ప్రత్యేకం. రెగ్యులర్ కమర్షియల్ జోనర్ సినిమాల నుంచి అప్పుడప్పుడు కాస్తా దూరంగా వచ్చి సినిమాలు చేసే ప్రయత్నం మహేశ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రత్యేకతే అతనికి హిట్ సినిమాల కంటే ఫ్లాప్స్ ని ఎక్కువ అందించింది. అయిన మహేశ్ బాబు తన ఫార్ములాని మాత్రం విడిచిపెట్టాడు. అందుకే మహేశ్ బాబు సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుంది అని కామన్ ఆడియన్స్ అనుకుంటారు. అలానే మహేశ్ బాబు సినిమాని చూస్తారు కూడా.

అయితే ఇప్పుడు మహేశ్ హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్టర్ లో స్పైడర్ సినిమా వచ్చింది. అయితే ఆ టైటిల్ చూసిన తర్వాత ఇది హాలీవుడ్ స్టైల్ లో నడిచే స్పై థ్రిల్లర్ అయి ఉంటుందేమో అని అందరు అనుకున్నారు. ఈ ఆలోచనలకి మురుగదాస్ గత సినిమాలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేకుండా స్టార్ హీరోలతో ఎప్పుడు సరికొత్త కథలని స్క్రీన్ మీద ఆవిష్కరించే మురుగదాస్ ఈ సారి మహేశ్ కి కూడా ఏదైనా కొత్త కథ అందిస్తాడని అందరు భావించారు. అయితే అనూహ్యంగా సినిమా చూసిన ప్రేక్షకులకి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయాయి. స్పైడర్ కథ ఇంచు మించు గతంలో మంచు విష్ణు హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అనుక్షణంని పోలి ఉండటం. ఆ సినిమా పోలీస్ కాప్ ఇన్వెస్టిగేషన్ తో చాలా సహజంగా నడుస్తుంది. అయితే స్పైడర్ లో దానికి కాస్తా ఎక్స్ట్రీమ్ స్ట్రోక్ ఇచ్చి. మహేశ్ ఇని ఇంటలిజెన్స్ ఆఫీస్ లో టెలిఫోన్ ఆపరేటర్ గా మార్చేసి, టెక్నాలజీని వాదుకొని సైకోని ఎలా పట్టుకున్నాడో అనే కోణంలో ట్రీట్ మెంట్ రాసుకున్నాడు. దానికి ఖర్చు కూడా ఎక్కువ పెట్టడం, సైకో వైలెన్స్ ని కూడా పెద్దగా చూపిస్తూ స్పైడర్ సినిమా డిజైన్ చేసారు.

అసలు సమస్య అక్కడే వచ్చింది. ఒక మామూలు సైకో థ్రిల్లర్ స్టొరీకి ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అనే ఫీలింగ్ కలిగింది. అసలు అల్ రెడీ తెలుగులో ఇది వరకు వచ్చిన కథకి మహేశ్ బాబు ఎలా ఒకే చెప్పాడు అనేది మాట కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఎప్పుడు సరికొత్త కథలని ఎంచుకునే మురుగదాస్ ఇలాంటి సాదాసీదా సైకో థ్రిల్లర్ కథని మహేశ్ లాంటి ఒక స్టార్ హీరోతో తీయాలని అనుకోవడం కూడా పెద్ద సాహసమే అని అందరు అనుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే. సినిమాకి హంగు, ఆర్బాటాలు గట్టిగానే చేసిన మురుగదాస్ అసలు విషయం మాత్రం వదిలేసాడు. బేసిగ్గా తెలుగు ప్రేక్షకులు సంగీత ప్రియులు, సినిమా కంటే ముందు తెలుగు ప్రేక్షకుడు పాటలు ఎలా ఉన్నాయి. మ్యూజిక్ ఎలా ఉంది అనే కోణంలో చూస్తాడు. ఎ విషయంలో హరీస్ జయరాజ్ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునే సంగీతం అందించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. సినిమాలో గుర్తుంచుకోదగ్గ పాట ఒక్కటి కూడా లేకపోవడం ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరిచే విషయం. అలాగే సినిమా ట్రైలర్ కూడా ఎ యాంగిల్ లో మెప్పించలేకపోయింది. పోనీ ట్రైలర్ లో అంతా రివీల్ చేస్తే సినిమా మీదా క్యురియాసిటి పోతుంది అనుకున్న. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడుని ట్రైలర్ కంటే గొప్పగా ఏమీ లేదు అని తేల్చి పడేసారు.

ఇక సూపర్ స్టార్ మహేశ్ అంటే స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు. అతను ఎలాంటి కాస్ట్యూమ్ వేసిన అతని లుక్ లో చాలా అద్బుతంగా ఉంటుంది. ప్రెజెంట్ జెనరేషన్ కాస్ట్యూమ్స్ విషయంలో మహేశ్ ని ఎక్కువగా ఫాలో అవుతారు. అయితే స్పైడర్ సినిమాలో పాటల్లో మహేశ్ బాబు స్టైలింగ్ ఎక్కడ ఆకట్టుకునే విధంగా ఉండదు. ఓవరాల్ గా చూసుకున్న పాటల కోసం వాడిన కాస్ట్యూమ్స్ తీసికట్టుగా ఉంటాయి.
ఇలా అన్ని స్పైడర్ సినిమాతో మురుగదాస్ ఎ అంశంలో కూడా తెలుగు ప్రేక్షకుడుని కన్విన్స్ చేయలేకపోయాడు. దానికి తోడు సినిమా అంతా తమిళ నేటివిటీలో ఉండటం వలన ఆడియన్స్ ఎమోషనల్ గా కూడా కనెక్ట్ కాలేకపోయాడు. ఇలాంటి పరిస్థితిలో 150 కోట్లు పెట్టిన పెట్టుబడి ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది. డిస్టిబ్యూటర్స్ పెట్టుబడిని ఇంత వరకు తిరిగి తెచ్చుకొగలరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

  •  
  •  
  •  
  •  

Comments