మరోసారి మెగా ఫ్యామిలీపై శ్రీ రెడ్డి కామెంట్స్!

Saturday, June 2nd, 2018, 07:50:50 PM IST

కొన్ని రోజుల క్రితం మీడియాల్లో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి ప్రస్తుతం ఎక్కువగా కనిపించడం లేదు. ఏ విషయమైనా సోషల్ మీడియా ద్వారా చెబుతూ ముందుకు సాగుతోంది. డిబేట్స్ కూడా మీడియా ఛానెల్స్ ఈ మధ్య పెట్టడం లేదు. ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్ నుంచి వివిధ వివాదాల్లోకి వెళ్లిన శ్రీ రెడ్డి ఇప్పుడు మరో సారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఫెస్ బుక్ లో ఆమె చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి.

మెగా ఫ్యామిలీలో ఒక వ్య్తక్తి క్లోజని, అయితే ప్రజారాజ్యంకు సంబందించిన పార్టీ అవకతవకలన్నీ తెలుసన్నట్లు తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్‌.. అతను చెప్పాడు ప్రజారాజ్యం అప్పుడు అవకతవకలు బాబోయ్‌.. ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరు వామ్మో అంటారు.. టైం వచ్చినపుడు రివీల్‌ చేస్తా..’ అని శ్రీరెడ్డి ఫెస్ బుక్ లో పేర్కొంది. దీంతో మరికొందరు నెటిజన్స్ ఆమెకు ప్రశ్నలు సంధిస్తున్నారు. నీ పోరాటం నువ్ చేయకుండా మధ్యలో ఇతరులను ఎందుకు లాగడం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు న్యాయం ఉంటే అందరూ నీకు మద్దతుగా ఉంటారు. ప్రతి సారి అనవసర విమర్శలు చేసి ఇంకా వాల్యూ తగ్గించుకోవద్దని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.