శ్రీదేవి కూతుళ్లు అందంతో చంపేస్తున్నారు కదా !

Saturday, October 21st, 2017, 11:21:16 AM IST

టాలీవుడ్ – బాలీవుడ్ అని తేడా లేకుండా దాదాపు ఇండియాలో ఉన్న అన్ని బాషల వారి చిత్రాల్లో నటించి అందరిని మెప్పించిన హీరోయిన్ శ్రీదేవి. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి ఎన్నో వినూత్న పాత్రలను చేశారు. అంతే కాకుండా ప్రముఖ అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు. అందంతోనే కాకుండా నటనలోను శ్రీదేవి టాప్ హీరోయిన్ గా కొనసాగారు. అయితే ఆమె కూతుళ్లు జాహ్నవి కపూర్ – ఖుషి కపూర్ కూడా త్వరలోనే వెండి తెరకు ఎంట్రీ ఇవ్వనున్నారు.

వీరికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలానే ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వకముందే వీరు అటు మీడియాల్లో ఇటు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నారు. ఎందుకంటే వారు రిలీజ్ చేస్తున్న ఫొటో షూట్స్ అలా ఉన్నాయి మరి. దీపావళి సందర్బంగా వారు దిగిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైనా సడన్ ఎంట్రీ ఇవ్వవొచ్చని అందరు అంటున్నారు. అదే విధంగా చిన్న కూతురు ఖుషి కపూర్ కోసం శ్రీదేవి కొన్ని స్క్రిప్ట్ లను వింటున్నట్లు టాక్.

  •  
  •  
  •  
  •  

Comments