ఆ ఉద్దేశ్యంతోనే అర్ధరాత్రి కలిశారు

Tuesday, October 14th, 2014, 03:40:57 PM IST

Errabelli-Dayakar-Rao
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు కడియం శ్రీహరిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఎర్రబెల్లి దయాకర్ రావును తెరాసలోకి రాకుండా కడియం శ్రీహరి అన్నిరకాలుగా అడ్డుకుంటున్నారు. ఎర్రబెల్లిపై కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసలోకి వచ్చి మంత్రి అవుదామని భావించారని..దానిని అడ్డుకోవడంతో ఎర్రబెల్లి అసహనంతో తనకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. తెరాసలో చేరే ఉద్దేశ్యం లేకపోతే.. అర్ధరాత్రి సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎందుకు కలిశారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితులలోను ఎర్రబెల్లిని తెరాసలోకి రానివ్వమని కడియం స్పష్టం చేశారు.