ఆ సెంటిమెంట్ నే వర్కవుట్ చేస్తున్న బోయపాటి ?

Friday, May 4th, 2018, 10:17:09 AM IST

సినిమా రంగంలో సెంటిమెంట్స్ కు కొదవే లేదు .. ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే .. దాదాపు నెక్స్ట్ సినిమా విషయంలో అదే పద్దతి ఫాలో అవడం మనం చూస్తున్నదే. ఇక తాజాగా రామ్ చరణ్ తో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా రెండో షెడ్యూల్ పూర్తీ కావొచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం శ్రీకాంత్ ని తీసుకున్నారట. ఈ పాత్ర కోసం ఎవరైనా సీనియర్ హీరోని పెట్టాలని ప్లాన్ చేసారు .. అయితే మొదటి నుండి శ్రీకాంత్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాడట బోయపాటి శ్రీను. ఇంతకు ముందే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో శ్రీకాంత్ నటించాడు .. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శ్రీకాంత్ సెంటిమెంట్ ని వర్కవుట్ చేసాడట దర్శకుడు. అలాగే చరణ్ తో కలిసి శ్రీకాంత్ గోవిందుడు అందరి వాడేలే సినిమాలో నటించాడు. చరణ్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments