ప్రభాస్ ని కూడా వదలని శ్రీ రెడ్డి.. ఆయనకు పిచ్చి ఉంది!

Saturday, March 17th, 2018, 01:14:24 PM IST

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. శ్రీ రెడ్డి అనే యువ నటి ఇండస్ట్రీ గురించి ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. బాడా నిర్మాతల నుంచి పవన్ కళ్యాణ్ – ప్రభాస్ లపై కూడా ఆమె ఆరోపణలు చేసింది. తాను ఓ నిర్మాత కొడుకుతో సన్నిహితంగా ఉన్న మాట నిజమే అని చెబుతూ.. అవకాశాల కోసం అతనితో స్నేహం చేస్తే ఒక్క అఫర్ కూడా దక్కలేదని శ్రీ రెడ్డి మీడియాకు చెప్పింది. ఇకపోతే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలంటే వివక్ష ఉందని కులం గజ్జి కూడా ఉన్నట్లు ఘాటుగా తెలిపారు.

అంతే కాకుండా టాప్ హీరోయిన్స్ ను కొంత మంది హీరోలు వారి పనుల కోసం రాజకీయ నాయకుల వద్దకు సరఫరా చేస్తుంటారని చెప్పి శ్రీ రెడ్డి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రీసెంట్ గా తన ఫ్రెండ్ ఒక వ్యక్తితో గడిపిన ఘటన గురించి చెప్పుకొని ఎంతో బాధపడిందని చెబుతూ.. వాడు ఎలా ఉన్నా కూడా గడపాలి. దొడ్డుగా ఉన్నా.. నోటి నుంచి దుర్వాసన వస్తున్నా కూడా పడుకోవాలి అని చెప్పిందని తెలియజేసింది. చాలా మంది తెలుగమ్మాయిలకు చిన్న చిన్న కారణాల చేత అవకాశాలు ఇవ్వడం లేదని తెలుపుతూ ప్రభాస్ గురించి ఓ విషయం చెప్పింది. ప్రభాస్ ఒక హైట్ పిచ్చోడు.. హైట్ గా ఉన్నా హీరోయిన్స్ నే సినిమాల్లో సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నిత్యా మీనన్ మంచి నటి కాదా?. సమంత మంచిగా యాక్టింగ్ చేయట్లేదా అని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించారు.