కేటీఆర్ ని టార్గెట్ చేస్తున్న శ్రీ రెడ్డి ?

Sunday, April 29th, 2018, 08:38:15 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ ని మరోసారి టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. ఇప్పటికే సోషల్ మీడియా లో తన విన్నపాన్ని తెలిపిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి స్పందించింది. ఇప్పటికే నాలుగు సార్లు ట్విట్స్ చేసానని, మరోసారి ట్విట్స్ చేస్తున్నానని, దయచేసి స్పందించమని చెప్పింది. కాస్టింగ్ కౌచ్ పై కొన్ని రోజులుగా పోరాడుతున్నామని, దానికి న్యాయం చేయాలనీ కోరింది. సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబాలు తమ సమస్యలపై సరైన విధంగా స్పందించడం లేదని తెలిపింది. ఇప్పటికే కేటీఆర్ ని కలవాలని ప్రయత్నం చేశామని చెప్పింది. ప్రస్తుతం కేటీఆర్ మహేష్ బాబు తాజా సినిమా భరత్ అనే నేను కు మంచి ప్రమోషన్ ఇచ్చారని, కానీ మహిళలపై సినిమా పరిశ్రమలో నెలకొన్న సమస్యల విషయంలో మాత్రం స్పందించేందుకు ఎందుకు సమయం కేటాయించడం లేదని ఆమె డిమాండ్ చేసింది. మరి ఈ విషయం పై కేటీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments