కేసీఆర్ గారు మీరు సూపర్ అండి—నటి శ్రీ రెడ్డి

Thursday, November 21st, 2019, 10:28:40 AM IST

సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ప్రముఖ సినీ నటుల పై సంచలన ఆరోపణలు చేస్తూ నటి శ్రీ రెడ్డి చాల ఫేమస్ అవుతుంది. తాజాగా సురేష్ బాబు మరియు యాక్టర్ నాని ఇళ్ల ఫై ఐటీ దాడులు జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే సురేష్ బాబు ని మరొకసారి కెలుకుతూ దేవుడు వున్నాడు సురేష్ బాబు గారు అంటూ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా నాని ఫై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. నాని పై మొదట నుండి ఆరోపణలు చేస్తుంది శ్రీ రెడ్డి. అయితే నాని ఇంటి ఫై ఐటీ దాడులు జరగడం తో శ్రీ రెడ్డి ఆనందం వ్యక్తం చేసింది.

అయితే శ్రీ రెడ్డి ఇలా అనడానికి కారణాలు లేకపోలేదు. సురేష్ బాబు కొడుకు తనని మోసం చేశాడంటూ పలు ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి. అంతేకాకుండా కొన్ని ఫోటోలని కూడా విడుదల చేసింది. నాని ఫై కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. అయితే ఇపుడు వారి ఇంటిని ఫై ఐటీ దాడులు జరగడం తో ఆనందాన్ని వ్యాక్యపరిచింది. కేసీఆర్ గారు మీరు సూపర్ అండి అని అంటూనే, నరేంద్ర మోడీ గారికి జై కొట్టింది.