షాక్ … బిగ్ బాస్ 2 లో శ్రీరెడ్డి ? డౌట్ లేదు..

Wednesday, June 6th, 2018, 11:17:20 AM IST


బిగ్ బాస్ సీజన్ 2 కు రంగం సిద్ధం అయినా విషయం తెలిసిందే. నాని హోస్ట్ గా చేయనున్న ఈ షో ఈ నెల 10 నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 16 మంది అబ్యార్తుదులు పాల్గొనగా 100 రోజులపాటు జరిగే ఈ షో లో ఎవరెవరు పాల్గొంటారన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవలే కాస్టింగ్ కౌచ్ పై నానా రభస చేసిన శ్రీ రెడ్డి కూడా ఇందులో పాల్గొతుందని వార్తలు వస్తున్నాయి. నిజానికి శ్రీరెడ్డి పాల్గొతుందన్న విషయం పై ఇప్పటికే సంచలనం రేపుతుండగా .. తాజగా శ్రీరెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం బట్టి .. ఈ అమ్మడు బిగ్ బాస్ 2 లో పాల్గొతుందని చెప్పకనే చెప్పింది. తాజాగా ట్విట్టర్ లో నానికి నాకు పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది .. కానీ ఎం చేస్తాం తప్పదు నాని అంటూ పోస్ట్ చేసింది. అంటే ఈ షో లో నేను పాల్గొంటున్నాను అంటూ చెప్పకనే చెప్పింది మరి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments