శ్రీ రెడ్డి వర్సెస్ నాని క్రేజ్?

Wednesday, April 11th, 2018, 03:15:05 PM IST

గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతోన్న నాని ఇప్పుడు మరో విజయం కోసం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణార్జున యుద్ధం ఈ గురువారం విడుదల కానుంది. అయితే సాధారణంగా నాని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ బజ్ వేరేలా ఉంటుంది. యూఎస్ నుంచి అమిర్ పేట్ వరకు నాని ఫ్యాన్స్ హంగామా ఓ లెవెల్లో ఉంటుంది. గత సినిమాలన్నీ మంచి హైప్ తో రిలీజ్ అయ్యాయి. కానీ కృష్ణార్జున యుద్ధం సినిమా విషయంలో మాత్రం తేడా కొట్టేసిందా అనే అనుమానం కలుగుతోంది.

ఎందుకంటే గత కొంత కాలంగా శ్రీ రెడ్డి వివాదం మీడియాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే సోషల్ మీడియాలో కూడా న్యూస్ వైరల్ అవ్వడంతో కృష్ణార్జున యుద్ధం హావా అంతగా కనిపించడం లేదు. మొన్నటి వరకు ఓ లెవెల్లో ఉన్న శ్రీ రెడ్డి వివాదం డైరెక్ట్ గా ఫొటోలు లీక్స్ చేసి పేర్లు బయటపెట్టడంతో ఆ న్యూస్ మరింత వైరల్ అయ్యింది. ఇక కృష్ణార్జున యుద్ధం ప్రమోషన్స్ బాగానే సాగుతోంది అనుకునే సమయంలోనే ఒక్కసారిగా మళ్లీ డౌన్ అయ్యింది. ఎక్కడా చూసినా శ్రీ రెడ్డి పై రూమర్లు కామెంట్లు. పైగా మీడియాల్లో డిబేట్లు పెట్టడంతో అందరు అటువైపే ఎట్రాక్ట్ అవుతున్నారు. గతంలో నాని సినిమాలకు ఎలాంటి పెద్ద సినిమాలు పోటీగా వచ్చినప్పటికీ పెద్దగా నష్టం ఉండేది కాదు. అలాగే ఎలాంటి ఇష్యూ నడిచినప్పటికీ సినిమాపై పెద్దగా ప్రభావం చూపేది కాదు. కానీ ఎవరు ఊహించని విధంగా శ్రీ రెడ్డి వివాదం నాని సినిమా క్రేజ్ ను తగ్గించిందనే టాక్ వస్తోంది. ఆ వివాదాలు ఇప్పట్లో తగ్గేలా లేవు. దీంతో నాని సినిమాకు బలమైన పాజిటివ్ టాక్ వస్తే తప్ప మళ్లీ క్రేజ్ ను అందుకోలేదు.

  •  
  •  
  •  
  •  

Comments