శ్రీ రెడ్డి వివాదం వల్ల గేట్ లోకి కూడా రానివ్వడం లేదట?

Wednesday, April 11th, 2018, 04:50:43 PM IST

శ్రీ రెడ్డి వివాదం రోజు రోజుకి తీవ్ర స్థాయిలో వివాదస్పదమవుతోన్న సంగతి తెలిసిందే. మా కమిటీ తీసుకున్న నిర్ణయం తరువాత మరింత వైరల్ అయ్యింది. దీంతో సినిమా పరిశ్రమలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ వివాదం వల్ల ఇప్పుడు అవకాశవాదులతో పాటు మంచి వారు కూడా బయపెడుతున్నారట. సినిమా ఆడిషన్స్ నిర్వహిస్తే ఇంతకుముందు ఆల్బమ్స్ తో చాలా మంది అమ్మాయిలు ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరిగేవారు. ఆడిషన్ లో అందరిని చెక్ చేసేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం చాలా మారింది. ఎలాంటి ప్రొడక్షన్ అయినా కూడా అమ్మాయిలు కనిపిస్తే దండం పెట్టేస్తున్నారట. ఎవరైనా తెలుగమ్మాయిలు అవసరం అయితే తెలిసిన వాళ్ల దగ్గరి నుంచి పిలిపిస్తున్నారని టాక్ వస్తోంది. అది కూడా అవసరమైతేనే. లేకుంటే మలయాళం నుంచి గాని కన్నడ నుంచి జూనియర్ ఆర్టిస్టులను రప్పిస్తున్నారట. అవకాశం ఇస్తామని చెప్పి పొరపాటున కుదరకపోతే ఎలాంటి నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చాలా మంది నిర్మాతలు దాదాపు కొత్తగా వచ్చే తెలుగమ్మాయిలకు దూరం పెట్టేస్తున్నారట. శ్రీ రెడ్డి వివాదం వల్ల ఓ విధంగా మంచి జరుగుతున్నప్పటికీ కొందరి నిర్మాతల ఆలోచన ధోరణి మరోలా ఉందని టాక్. బ్లాక్ మెయిల్ చేస్తే పరిస్థితి ఏమిటనే విధంగా కూడా ఆలోచిస్తున్నారట. మరి ఆ ఆలోచన ధోరణి ఎప్పుడు మారుతుందో?