శ్రీ రెడ్డి లీక్స్ : నిర్మాత కొడుకుతో వున్న ఫోటోలు బయటపెట్టిన శ్రీరెడ్డి

Wednesday, April 11th, 2018, 12:02:38 PM IST

ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ విషయం లో టాలీవుడ్ లో పెద్ద ప్రకంపనలే రేగుతున్నాయి. ఓ వైపు రకుల్ ప్రీత్ సింగ్ వంటివారు మాకు అటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదని చెపుతున్నప్పటికీ, కొందరు మాత్రం శ్రీరెడ్డి కి మద్దతుగా తమకు కూడా అవకాశాలకోసం వెళితే లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆమె వైవా హర్ష, డైరెక్టర్ శేఖర్ కమ్ముల, అలానే ఒక నాచురల్ స్టార్ అంటూ పలువురు పేర్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. కాగా నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ,

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరాం తనను శారీరకంగా ఇబ్బంది పెట్టాడని, అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పలువిధాలుగా తన కోరికలు తీర్చుకున్నాడని ఆరోపిస్తోంది. అంతటితో ఆగకుండా అతని తో కలిసి వున్న ఫోటోలను ఆమె మీడియా కి విడుదల చేసింది. అయితే ఆమె మీడియా కి విడుదల చేసిన ఈ ఫోటోలలో ఎంతవరకు నిజం వుంది అనేది తెలియాల్సి వుంది. ఆమె చెపుతున్నవన్నీ ఒట్టి అబద్ధాలని, తాను పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందని, నిజానికి ఆమె వెనుక కొందరు ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి…..