శ్రీ రెడ్డి అర్ధనగ్న నిరసన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Saturday, April 7th, 2018, 03:20:45 PM IST

గత కొంత కాలంగా మీడియాలో బాగా కనిపిస్తోన్న శ్రీ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఎవరు ఊహించని విధంగా నిరసనను వ్యక్తపరచింది. తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యత్వం ఇవ్వలేదంటూ ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ద నగ్నంగా ధర్నాకు దిగింది. దీంతో మీడియాలో ఈ వార్త ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఆమె నిరసనకు సంబందించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. శ్రీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒక సినిమాలో నటిస్తే మా సభ్యత్వం కార్డు ఇస్తారు. కానీ తాను మూడు సినిమాల్లో నటించినప్పటికీ కార్డు ఇవ్వరా? అని ప్రశ్నించారు. అలాగే తెలుగు నటులు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే మా అసోసియేషన్ ఏం చేస్తోందని అన్నారు. అయితే కొద్దీ సేపటి తరువాత శ్రీ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె నివాసం వద్దకు తీసుకెళ్లి దింపారు.