ఒకాయనపై పోరాటాన్ని ఆపేస్తున్నా అంటూ శ్రీ రెడ్డి కామెంట్ ?

Wednesday, April 25th, 2018, 03:21:54 PM IST

ప్రస్తుతం తానూ ఒకాయనపై చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నా అంటూ నటి శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా లో పెడుతూ ఇక మళ్ళీ మా నిరసనలు కొనసాగిస్తాం. మాకు ఎవరిపైన ప్రత్యేకించి ఆగ్రహం లేదు. అయితే ఒకాయన వ్యాఖ్యలు, ప్రవర్తనతో బాదపడ్డాము అంటూ ఆయనపై చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నాను, ఇక నా పోరాటం టాలీవుడ్ పరిశ్రమను మార్చడం పైనే ఉంటుంది. ఇక పై వ్యక్తిగత యుద్దాలు ఉండవు, నా కన్నా నా నిరసనలనే ఎక్కువగా గౌరవిస్తున్నా కృతజ్ఞతలు అంటూ కామెంట్ పెట్టింది. శ్రీ రెడ్డి ఎవరి గురించి ఒకాయన అంటూ సంబోదించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ – శ్రీ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఈ విషయంలో వర్మ అగ్గికి ఆజ్యం పోసినట్టు మరింత పెంచేసాడు.

  •  
  •  
  •  
  •  

Comments