హీరో నానీని టార్గెట్ చేసి మళ్ళీ రంగంలోకి దిగిన శ్రీరెడ్డి..

Monday, May 7th, 2018, 12:43:12 PM IST

శ్రీ రెడ్డి, కొద్దిరోజుల క్రితం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడి, ప్రధాన అంశంపై తీవ్రమైన పోరాటంతో ముందుకు వచ్చిన తరువాత నటి శ్రీరెడ్డి అర్ధంకాని విధంగా నిశబ్దం పాటించింది. ఇండస్ట్రీలో దుమ్ము దుమారం లేపి అటు సినీ పరిశ్రమ వాళ్ళని, ఇటు రాజకీయ రాయకీయ నాయకులని ఒక్క ఊపు ఊపి వదిలేసింది. ఎన్ని చేయాలో అన్ని తప్పులు చేసి, పోరాటాలు చేసి, కొందరికి క్షమాపణలు చెప్పి కొద్ది రోజులుగా చాలా నిశ్శబ్దత పాటిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా శ్రీ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యులో మళ్ళీ ఒక కొత్త కోణంతో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తన ఫేస్ బుక్, ట్విట్టర్ ట్వీట్లు ఇంతకూ ముందు వాటికంటే ఈ సారి ఇంకా సంచలనం రేపెలా చేస్తున్నాయి.

ఇటివల ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశం ప్రకారం శ్రీ రెడ్డిపై ఆగ్రహం చూపిస్తున్న నేటిజన్స్ పై లీగల్ యాక్షన్ తీస్కుంటానని చెప్పింది. అందరు చెప్పినట్టుగానే ఇక పోలీసుల సహాయం, న్యాయవాదుల సహాయం తీస్కోని తనకు వచ్చిన కోపాన్ని తాను చేస్తున్న పోరాటం వైపుకు మళ్ళించి ఈ పోరాటం మరింత ఉద్రిక్తం అయ్యేలా చేస్తానని చెప్పింది. ప్రముఖ నటుడు నాని, దర్శకుడు శేఖర్ కమ్ముల పై చేసిన ఆరోపణలు నిజమైనవని, దాన్ని ఎవరూ సీరియస్ తీస్కోవడం లేదని, కనీసం మీడియా కూడా చాలా నెమ్మదితనాన ప్రవర్తించిందని, ఎవరిని ఎక్కడ ఎలా ఇరికించాలో తనకి బాగా తెలుసు అని శ్రీ రెడ్డి వెల్లడించింది. ఇప్పటికి కూడా శ్రీ రెడ్డి సినీ పరిశ్రమలోని సీనియర్ల మీద ట్వీట్లు చేయడం మానకపోగా థియేటర్లు అన్ని సురేష్ బాబు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్, మరియు దిల్ రాజు లాంటి నలుగురు మాఫియా గుప్పెట్లో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా తాజాగా సినీ నటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంఎల్ఏ రోజా చెప్పినట్టు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదని అక్షరాలా అసత్యమని, బహుశా అలాంటివాళ్ళు రోజా దగ్గరికి రాలేదేమోనని, ఏది ఏమైనా నేను తగ్గేది లేదని శ్రీ రెడ్డి తెలిపింది.

ప్రముఖ నటుడైన నాని వల్ల ఒక అమ్మాయి నరకం అనుభవించిందని ఆరోపించడమే కాకుండా శ్రీ రెడ్డి ఫేస్ బుక్ పోస్టులు, ట్విట్టర్ ట్వీట్లు బూడిదలో పోసిన పోన్నీరు అయిందని అభివర్ణించింది.

  •  
  •  
  •  
  •  

Comments