”మా”అసోసియేషన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ?

Thursday, September 6th, 2018, 10:40:51 PM IST

సంచలన తార శ్రీ రెడ్డి .. గత కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై రకరకాల కామెంట్స్ చేస్తూ వరుసగా సంచలనాలు రేపుతూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ కు సంబందించిన వివరాలు తనవద్ద ఉన్నాయంటూ నా రభస చేసింది. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జరిగిన వివాదం పై శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్న శివాజీ రాజా, శ్రీకాంత్ ల గోచి ఊడిపోయి దరిద్రపు గతి పట్టిందని .. తాను మోసపోయి వస్తే ఓదార్చాల్సింది పోయి బడా బాబులను కాపాడారని, నాకు కోట్ల రూపాయలు ఇవ్వాలని శివాజీరాజా అతడి గ్యాంగ్ గట్టి ప్రయత్నం చేసిందని .. కడుపు మండిన నేను ఆ డబ్బులు తీసుకోలేదని… ఆడపిల్ల ఏడుపు ఊరికే పోదని గట్టిగానే స్పందించింది.

శివాజీ రాజా అండ్ గ్యాంగ్ వృద్ధాశ్రమం పేరుతొ చిందులేసి వచ్చిన డబ్బులు అందరు పంచుకు తిన్నారని గట్టిగానే స్పందించింది. అందరు .. తోడు దొంగలే అని ఈ వ్యవహారంలో ఓ పెద్ద హీరో వాటా పెద్ద మొత్తంలో వెళ్ళిందంటూ ఘాటుగానే స్పందించింది. ఇటీవలే అమెరికాలో జరిగిన దాని గురించి నాదగ్గర పూర్తీ సమాచారం ఉందని చెప్పింది. మరి ఈ విషయంలో అయినా శ్రీ రెడ్డి అధరాలు బయటపెడుతుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments