ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుంటున్నా: శ్రీ రెడ్డి

Saturday, April 14th, 2018, 04:17:54 PM IST

శ్రీ రెడ్డి వివాదం ఓ కొలిక్కి వచ్చింది అని అనుకుంటున్న సమయంలో ఆమె నిర్ణయం మరొక కొత్త వివాదానికి దారి తీసింది. దిల్ రాజుపై ఎవరు ఊహించని విధంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. రీసెంట్ మీడియాతో మాట్లాడిన శ్రీ రెడ్డి తన పేరును మార్చుకుంటున్నట్లు తెలిపింది. ‘ఈ రోజు నేను ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నాను.. అదేంటంటే నా పేరులో ‘రెడ్డి’ అని ఉన్న పదాన్ని మోయడం బరువుగా అనిపిస్తోంది.. నా పేరు ఇక నుంచి శ్రీరెడ్డి కాదు శ్రీశక్తి.. నా గురించి మీడియా రాసేటప్పుడుగానీ, చదివేటప్పుడుగానీ శ్రీశక్తి అనే రాయండి, చదవండి’ అని నటి శ్రీరెడ్డి మీడియా ద్వారా తెలిపింది. ఇక తన పోరాటం ఇంకా అయిపోలేదని చెబుతూ.. ఎప్పుడైతే నిర్మాత దిల్‌ రాజు చేతుల్లోంచి థియేటర్లు బయటపడతాయో అప్పటి వరకు శ్రీ శక్తి గానే ఉంటాను. నేను చేసిన పోరాటం ఈ స్థాయికి వస్తుందని అనుకోలేదు. ఎక్కడ అమ్మాయిలకు అన్యాయం జారిగిన వారికీ అండగా ఉంటాం. ఓయూ విద్యార్థులను కలుపుకొని వెళతాము అంటూ శ్రీ రెడ్డి వివరించింది.