పబ్లిక్ లో నగ్నంగా నిలబడతా..కేసీఆర్ స్పందించాలి : శ్రీ రెడ్డి

Friday, April 6th, 2018, 11:02:44 AM IST

టాలీవుడ్ లో గత కొంత కాలంగా శ్రీ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దాడులు, మోసాలపై పోరాటం చేస్తున్నానని మీడియాలలో చర్చలు పెడుతోన్న శ్రీ రెడ్డి కేసీఆర్ గారికి సోషల్ మీడియా ద్వారా ఒక విషయాన్ని తెలిపింది. ‘కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే… నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు ఎలాగైతే పోరాడి, సక్సెస్ అయ్యారో..నేను కూడా అదే మార్గాన్నే ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతానని ఫెస్ బుక్ లో పోస్ట్ చేసింది. అదే విధంగా దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే సినీ రంగంలో ప్రముఖులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.